జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రొద్దుటూరు(Proddatur) వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు సవాల్ విసిరారు. శనివారం రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్(Pawan Kalyan) నీవు నిజంగా స్టార్ అయితే.. ప్రొద్దుటూరు(Proddatur)లో పోటీ చెయ్.. అసెంబ్లీకి ఎలా వెళ్తావో నేను చూస్తా’ అని ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణి కలిగి వాడని అన్నారు. ఒకసారి సీఎం అభ్యర్థిని కాదు అని, మరోసారి తానే సీఎం అభ్యర్థిని అని సొంత కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేవలం 30 స్థానాల్లో పోటీ చేసే జనసేనాని సీఎం అభ్యర్థి ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు. పవన్ జనసైనికులతో పాటు కాపులనూ మోసం చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డితో తలపడే శక్తి సామర్ధ్యాలు పవన్‌కు లేవన్నారు.
Proddatur | దమ్ముంటే ప్రొద్దుటూరులో పోటీ చెయ్.. పవన్ కల్యాణ్‌కు MLA సవాల్
-
- Advertisement -