Kishan Reddy | టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: కిషన్ రెడ్డి

-

తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) ప్రాంగణంలో రాజకీయ సంబంధిత అంశాల గురించి మాట్లాడటం, రాజకీయ ప్రసంగాలు చేయడంపై నిషేధం విధిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. టీటీడీ నిర్ణయాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈరోజు తిరుమల వేంకటేశ్వరస్వామిని సందర్శించిన సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో రాజకీయ ప్రసంగాలు చేసిన వారికి ఎటువంటి ప్రత్యేక ప్రవేశాలు, దర్శనాలు కూడా కల్పించకుండా నిర్ణయం తీసుకోవాలని, అప్పుడే ఇలాంటివి కట్టడి అవతాయని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -

‘‘తిరుమలలో ఇటువంటి ప్రసంగాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు(Non Hindus) పనిచేయకూడదు. ఈ విషయంలో టీటీడీ పాలకమండలి చాలా సీరియస్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. వీరందరినీ ఇతర శాఖలకు, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడానికి తీసుకుంటున్న చర్యలు సరైనవే. ఎవరి మత విశ్వాసాలు వారికుంటాయి. అందుకు అనుగుణంగానే అందులో పని చేసే సిబ్బంది కూడా ఉండాలి. గత ఐదు సంవత్సరాల కాలంలో అనేక వ్యవహారాలు నడిచాయి‌. కల్తీ నెయ్యి లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా పాలక మండలి గాని అధికారి యంత్రాంగం గాని పట్టుదలగా పని చేయాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు కిషన్ రెడ్డి(Kishan Reddy).

Read Also: రాజన్న సిరిసిల్లపై ముఖ్యమంత్రి వరాల జల్లు
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | అవినాష్‌ను అరెస్ట్ చేయాలి.. షర్మిల డిమాండ్

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న అంశంపై ఏపీ కాంగ్రెస్ వైఎస్...

Aadi Srinivas | కేసీఆర్ మాట తప్పినా.. రేవంత్ తప్పలేదు: ప్రభుత్వ విప్

వేములవాడ రాజ రాజేశ్వరి ఆలయ(Vemulawada Temple) అభివృద్ధి కోసం రూ.76కోట్ల నిధులు...