Cyclone Sitrang: ఆంద్రప్రదేశ్ వైపు సిత్రాంగ్ తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోండగా.. నేడు అండమాన్ తీరంలో మరింత బలపడే అవకాశం ఉందని.. క్రమంగా వాయుగుండంగా మారుతోందని, అనంతరం సిత్రాంగ్ తుఫాన్ (Cyclone Sitrang) గా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ వాయుగుండం ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా ఓ మోస్తరు లేదా సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 24 నాటికి తీవ్ర తుఫాన్‌గా బలపడిన క్రమంలో 25 తర్వాత బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం తుఫాను హెచ్చరికల కారణంగా ముంపు ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, అమలాపురం: 08856 293104, వాట్సాప్ నంబర్: 99495 15348, అమలాపురం ఆర్డీవో కార్యాలయం: 08856 233100, రామచంద్రాపురం ఆర్డీవో కార్యాలయం: 08857 245166, కొత్తపేట ఆర్డీవో కార్యాలయం: 9059461848 నంబర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. తుఫాన్ కరణంగా మత్స్యకారులు శనివారం నుంచి సోమవారం వరకు ఒడిశా వైపు చేపల వేటకు వెళ్లొదని ప్రభుత్వం హెచ్చరించింది.
Read also: TSRTC ఉద్యోగులకు శుభవార్త