అయ్యో ఎమ్మెల్యే నిమ్మల.. ఎంత పని అయ్యింది సారూ!

-

అనువుగాని చోట అధికులమనరాదు అన్న తాత్పర్యం ఎమ్మెల్యే నిమ్మలకు ఇప్పుడు బోధపడి ఉంటుంది. ఆర్టీసీ బస్సులో సామాన్యులతో కలిసి ప్రయాణం చేద్దామనుకోవటం, వారి సమస్యలను తెలుసుకోవాలనుకోవటం ఏ ప్రజా నాయుకుడైనా చేద్దామనుకుంటారు. దీనికి నేను తీసుపోను అంటూ, పాలకొల్లు ఎమ్మెల్యే అనుకున్నారో, ఏమో.. పాలకొల్లులోని ఓ ఆర్టీసీ బస్సు ఎక్కారు. అందులో ఉన్న ప్రయాణీకులతో మాట్లాడటం మెుదలుపెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తన్న సంక్షేమ పథకాలపై బురదజల్లే ప్రయత్నం చేశారు. దీంతో బస్సులో ఉన్న మహిళలు ఒక్కసారిగా రివర్స్‌ అయ్యారు. సీఎం జగన్‌ తమ మేలుకోరే సంక్షేమ పథకాలే అమలు చేస్తున్నారని, ఇంటి స్థలాలు ఇస్తున్నారని వాదించటంతో ఎమ్మెల్యే కంగు తిన్నారు. ఈ తంతంగాన్ని బస్సులో ఉన్న మరో మహిళ సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించింది. దీంతో ఎమ్మెల్యే సదరు మహిళ చేతిలోని సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. ఆ దృశ్యాలను డిలీట్‌ చేసేస్తాను.. నా ఫోన్‌ ఇచ్చేయండి అని మహిళ ప్రాథేయపడినా, ఎమ్మెల్యే వినకుండా పక్కనే ఉన్న మరో టీడీపీ నేతకు ఫోన్‌ ఇచ్చారు. దీంతో ఆ మహిళ ఎమ్మెల్యే మెడలోని కండువాను, చొక్కాను లాగటంతో ఎమ్మెల్యే కేకలు వేశారు. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందంటూ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేకు.. మహిళల నుంచి ఇటువంటి స్పందన రావటం మింగుడు పడని అంశమే. ప్రస్తుతం ఈ వీడియోను వైసీపీ నేతలు తీవ్రంగా వైరల్‌ చేస్తున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...