Vallabhaneni Vamsi | వంశీ పై మరో కేసు.. మళ్ళీ రిమాండ్ పొడగింపు

-

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) పై తాజాగా మరో కేసు నమోదైంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వంశీపై భూకబ్జా కేసు నమోదైంది. హై కోర్ట్ న్యాయవాది భార్య సుంకర సీతామహాలక్ష్మీ వంశీపై కంప్లైంట్ చేసారు. తన పేరిట గన్నవరం లోని గాంధీ బొమ్మ సెంటర్ లో ఉన్న 10 కోట్ల విలువైన స్థలాన్ని వంశీ కబ్జా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీతో పాటు మరో 15 మందిపై ఆమె ఫిర్యాదు చేసారు. గతంలో విషయంపై కంప్లైంట్ చేసిన ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు.

- Advertisement -

వంశీ చేసిన అక్రమాలు ఒక్కొకటి బయటికి వస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసు ను కూడా సిట్ కు అప్పగించాలని సీతామహాలక్ష్మీ కోరారు. స్థలానికి సంబందించిన అన్ని డాకుమెంట్స్ ను సిట్ కు అందిస్తామని ఆమె తెలిపారు.

ఇది ఇలా ఉండగా, విజయవాడ స్పెషల్ కోర్ట్ వంశీ రిమాండ్ ను మార్చి 11 వరకు పొడిగించింది. కోర్ట్ ఆదేశాల మేరకు వల్లభనేని వంశీని(Vallabhaneni Vamsi) పోలీసులు కస్టడీ కి తీసుకున్నారు. నేటి నుండి మూడు రోజులపాటు పోలీసులు విచారించనున్నారు. టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారించనున్నారు. టీడీపీ గన్నవరం(Gannavaram) కార్యాలయంపై దాడి పై సత్యవర్ధన్ ఇచ్చిన కంప్లైంట్ ను వెనక్కి తీసుకోవాలని వంశీ వర్గీయులు కిడ్నాప్ చేశారనే కేసులో వంశీ అరెస్ట్ అయినా విషయం తెలిసిందే.

Read Also: బరువు త్వరగా తగ్గాలంటే వాకింగ్ చేయాలా? సైక్లింగ్ చేయాలా?
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Errabelli Dayakar Rao | ‘మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’

తెలంగాణలోని మిర్చి రైతులు(Mirchi Farmers) కష్టాల కడలిని ఈదుతున్నారని, కనీస మద్దతు...