సచివాలయ ఉద్యోగి, వాలంటీర్ మధ్య ప్రేమ.. రామాలయంలో బందిగా మారిన జంట

-

Machilipatnam |ఔను వాళ్లిదరూ ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలు తమ ప్రేమను కాదంటారన్న భయంతో రాముడి గుడిలో బందీ అయ్యారు. ఒకరోజు పాటు గుడి తలుపులు బిగించుకుని లోపల ఉండిపోయారు. ఆ సీతారాముల సమక్షంలోనే పెళ్లి కూడా చేసుకున్నారు. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో బయటకు వచ్చారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రేమజంట వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

- Advertisement -

ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నాని(Machilipatnam)కి చెందిన గాయత్రి బుద్దాలపాలెంలో గ్రామ సచివాలయ ఉద్యోగిగా పని చేస్తోంది. అదే గ్రామానికి చెందిన నాగరాజు వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే కులాలు వేరు కావడతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని భావించారు. అంతే ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి గ్రామంలో ఉన్న కోదండ రాయాలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.

అయితే తమ పెద్దల నుంచి ముప్పు ఉంటుందని బయటకు రాకుండా గుడి లోపలి తలుపులకు తాళం వేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సోమవారం సాయంత్రం బయటకు వచ్చారు. అనంతరం ఇరు కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Read Also: మహిళల మానసిక ఒత్తిడి తగ్గించే 3 సులువైన చిట్కాలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...