అమరావతి(Amaravati) నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. అమరావతిని ఏఐ సిటీగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా సీఆర్‌డీఏ ఆఫీసు నిర్మాణాన్ని కూడా 90 రోజుల్లో పూర్తి చేయాలంటే అధికారులకు డెడ్‌లైన్ పెట్టారు. అత్యాధునిక టెక్నాటజీని ఉపయోగించి నాణ్యతలో రాజీ లేకుండా ఏఐ, అమరావతిని కలిసి ఇంగ్లీషులో ఒక లోగోను రూపందించాలని కూడా అధికారులను దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అదే విధంగా అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయని, వాటికి తగ్గ ఏర్పాట్లను కూడా పూర్తి చేయాలని సూచించారు. పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా అన్నీ సన్నద్ధం చేయాలని వెల్లడించారు.
అనంతరం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వమించారు. హ్యాపీ నెస్ట్‌లోని ప్లాట్లన్నీ గంటలోనే అమ్ముడయ్యాయని, గత ప్రభుత్వ చర్యల వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీటితో పాటుగా మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అమరావతి(Amaravati)ని అన్ని విధాలా మేటి సిటీగా తీర్చిదిద్దాలని, అన్ని విషయాల్లో అత్యాధునిక వసతులు కల్పించాలని సూచించారు.