ప్రేమను కాదన్నాదని.. చంపేశాడు

-

కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో కత్తితో అతిదారుణంగా దాడి చేసి, యువతిని చంపేశాడో ప్రేమోన్మాది. కాకినాడ రూరల్‌ కాండ్రేగుల కూరాడ గ్రామానికి చెందిన దేవకి అనే యువతిని, అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. తన ప్రేమ విషయాన్ని దేవకికి చెప్పగా, ఆమె నిరాకరించింది. దీంతో దేవకిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దేవకి కరప నుంచి కూరాడకు స్కూటీపై వస్తుండగా.. సూర్యనారాయణ వెంబడించాడు. అతడి వెంట తెచ్చుకున్న కత్తితో దేవకిపై విచక్షణారహితంగా దాడి చేయటంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే ఉన్న స్థానికులు సూర్యనారాయణను పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిందని తెలిసి, ఆ తల్లిదండ్రులు గుండలవిసేలా రోదిస్తున్నారు. దేవకి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...