తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్(Buddha Prasad), నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో చేరడం ఆసక్తిగా మారింది. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ఇద్దరు నేతలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ, పాలకొండ స్థానాలు దక్కాయి. ఈ రెండు స్థానాలు జనసేనకు వెళ్లడంతో ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున పోటీ చేయాలని భావించిన బుద్ధప్రసాద్, జయకృష్ణకు నిరాశ ఎదురైంది. దీంతో టీడీపీకి రాజీనామా చేసి జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
కాగా టీడీపీ-బీజేపీ పార్టీలతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీట్లలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధించాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 19 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలకు గట్టి అభ్యర్థులను నిలబెట్టారు. మిగిలిన అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల నుంచి కూడా బలమైన నేతలను నిలబెట్టాలని భావించిన.. వీరిద్దరిని పార్టీలో చేర్చుకున్నారు.