వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh)ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని మియాపూర్‌ల అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను మంగళగిరికి తరలించి ఈరోజు మంగళగిరి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఆయన కేసును విచారించిన న్యాయస్థానం.. నందిగం సురేష్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా అజ్ఞాతంలో ఉన్న జోగి రమేష్ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు ఉన్నతాధికారులు చెప్పారు.
హైకోర్టులో వైసీసీ నేతలకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడటంతో వైసీపీ నేతల అరెస్ట్‌కు ఏపీ పోలీసులు సిన్నద్దమయ్యారు. ఇందులో భాగంగానే నందిగం సురేష్(Nandigam Suresh)ను అరెస్ట్ చేయడానికి ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. దాదాపు 15 నిమిషాలు పోలీసులు అక్కడే వేచి చూశారు. సురేష్ ఇంట్లో లేరని నిర్ధారించుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు సురేష్.. హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలియడంతో ఇక్కడకు చేరుకుని పక్కాసమాచారంతో సురేష్‌ను అరెస్ట్ చేశారు.