వరద ప్రాంతాల్లో చేపడుతన్న సహాయక చర్యలపై అధికారులకు సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు విషయంలో ఖర్చుకు ఏమాత్రం వెనకాడొద్దని తెలపారు. అదే విధంగా కళ్యాణ మండపాలు, హోటళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వరద బాధితులకు మూడు పూటల ఆహారం, స్వచ్ఛమైన తాగు నీరు అందించాలని తెలిపారు. కష్ట కాలంలో ప్రభుత్వం వారి వెంటే ఉంటుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేలా అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు. అనంతరం సింగ్‌నగర్‌లో ఆయన పర్యటించిన అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నబోట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్ల సహాయంతో బోట్ల మ్యాపింగ్ చేయాలన్నారు. బోట్లను మారుమూల ప్రాంతాలకు కూడా పంపాలని ఆదేశించారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో ఎంత మంది ప్రాణాలను మనం కాపాడగలిగాము అన్నదే ముఖ్యమని, బోట్లు కూడా కొట్టుకుపోతున్న క్రమంలో మన మందు అనేక సవాళ్లు ఉన్నాయని ఆయన(Chandrababu) చెప్పారు. బొట్లలో వచ్చిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బస్సులు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే వృద్ధులు, రోగులకు ఇబ్బంది లేకుండా వారిని హోటళ్లలోనే ఉంచాలని ఆదేశించారు. వరద పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రులు కూడా అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.