Vizag | విశాఖ ఇండస్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో రోగులు..

-

విశాఖపట్టణం(Vizag)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగదాంబ జంక్షన్‌లో ఉన్న ఇండస్ ఆసుపత్రి(Indus Hospital)లో పెద్ద ఎత్తులన మంటలు వ్యాపించాయి. దీంతో క్షణాల్లోనే ఆసుపత్రి ప్రాంగణమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోగుల హాహాకారాలు మిన్నంటాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

Vizag | ఆసుపత్రి పైఅంతస్తుల్లో ఉన్న రోగులను నిచ్చెనల సహాయంతో కిందికి తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్‌లలో సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆపరేషన్‌ థియేటర్‌లో జరిగిన ప్రమాదం కారణంగానే మంటలు వచ్చాయని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: తెలంగాణ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...