Medical students: ఏపీ వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. డీఎంఈ ఆదేశాలు

-

Medical students did not wear t shirt and jeans pant: ఏపీలో వైద్య విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) ఆంక్షలు విధించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించరాదని స్పష్టం చేసింది. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదని పేర్కొంది. అమ్మాయిలు అయితే చీర, చుడీదార్ మాత్రమే ధరించాలని సూచించింది. అబ్బాయిలు షేవ్ చేసుకోవడంతో పాటు.. జుట్టు, గెడ్డం చక్కగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మహిళా విద్యార్థులు జుట్టు వదులుగా వదిలేయకూడదని తెలిపింది. జట్టును హెయిర్‌ బాండ్‌తో ముడి వేసుకోవాలని తెలిపింది. వైద్య విద్యార్థులంతా ప్రధానంగా యాప్రాన్‌ వేసుకోవడంతో పాటు మెడలో తప్పనిసరిగా స్టెతస్కోప్‌ ధరించాలని.. విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమీక్షలో నిర్ణయాలను తీసుకుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...