Mega star Chiranjeevi Comments on politics of Pavan kalyan: రాజకీయాల్లో ఉండాలంటే చాలా మెురటుగా, కటువుగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆ లక్షణాలు లేకపోవటం కారణంగానే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు చిరంజీవి వివరించారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన నర్సాపూర్ వైఎన్‌ఎంసీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అడుగు పెట్టాలన్నది తన మనసు నుంచి వచ్చింది కాదని అన్నారు. ఆ రంగంలో మాటలు అనాలన్నా.. అనిపించుకోవాలన్నా తన సోదరుడు పవన్ కల్యాణ్ సమర్థుడని కితాబు నిచ్చారు.
పవన్‌ను ఏదొక రోజు ఉన్నత స్థాయిలో చూసే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠాల కంటే జీవిత పాఠాలను ఎలా చదవాలో వైఎ్‌ఎంసీ కళాశాల నేర్పించిందని.. ఆనాటి జ్ఞాపకాలను చిరంజీవి (Mega star Chiranjeevi) గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ డీఎస్ ఆర్ వర్మ, గ్రంధి భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు