Heavy Rains |నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులుతో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట ప్రాంతాల ప్రజలు.. అల్లూరి జిల్లాలోని అనంతగిరి, అరకులోయ, జీకే వీధి, కొయ్యూరు మండల్లాలో పిడుగులు ఎక్కువగా పడవొచ్చని పేర్కొంది. అందుచేత పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని హెచ్చరించింది.
మరోవైపు తెలంగాణ(Telangana)లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారు వెల్లడించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తుండడంతో వాతావరణం చల్లగా మారనుందని పేర్కొంది.
Read Also:
1. చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు.. సార్ క్షమించండని వేడుకోలు
2. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం: బీజేపీ
Follow us on: Google News, Koo, Twitter