Rain Alert | తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో ఆవర్తనం బలపడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర తెలంగాణలోనూ వర్షాలు దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Rain Alert | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ఇలాంటి వాతావరణం ఉండనుంది. తీర ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. అటు తెలంగాణలోనూ వర్షాలు దంచికొడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నేటి నుంచి 5 వరకు రెయిన్ అలర్ట్ కొనసాగనుంది.
ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడటం లేదు. ఆగస్టు నెలలో వరుణుడి జాడ లేదు. ఎల్‌నినో, హిమాలయాల వైపు రుతుపవనాలు వెళ్లడంతోనే వర్షాలు పడటం లేదని ఐఎండీ చెబుతోంది. ఐతే ఈనెలలో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని అంటోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పొలంలో నాట్లు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఐఎండీ తీపికబురు అందించింది.