ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు(AP EAPCET Results) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) విజయవాడలో ఈ ఫలితాలను విడుదలచేశారు. ఇంజనీరింగ్ విభాగంలో చల్లా ఉమేష్ వరుణ్‌కు 158 మార్క్స్‌తో మొదటి ర్యాంక్.. బూరుగుపల్లి సత్య రాజా జస్వంత్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 153 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు 2,24,724 మంది విద్యార్ధులు హాజరు కాగా..1,71,514 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 90,573 మంది విద్యార్ధులు పరీక్ష రాయగా.. 81,203 మంది క్వాలిఫై అయ్యారు. మే 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరిగాయి. అనంతపురం జేఎన్‌టీయూ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3,37,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25 శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఈఏపీసెట్(AP EAPCET Results) ర్యాంకులను ప్రకటించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
- Advertisement -