అరసవెల్లి వచ్చి అమరావతి రైతులు దేవుణ్ణి మెుక్కుకొని వెళ్తే మాకు అభ్యంతరం లేదు.. కానీ ఈ గడ్డ మీదకి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. విశాఖ రాజధాని కోసం తాను రాజీనామాకైన సిద్ధమని ధర్మాన ప్రకటించారు. అరసవెళ్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఆయన, మూడు రాజధానుల అంశంపై ప్రసంగించారు. విశాఖ రాజధాని కోసం ఉద్యమం అవసరమని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దు అంటే ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. దశాబ్దాల తరువాత వచ్చిన అవకాన్ని వదులుకోమని మంత్రి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడితోనే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. విశాఖ రాజధాని కోసం శ్రీకాకుళం జిల్లా వాసులు గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం: మంత్రి ధర్మాన
-