Kakani Govardhan Reddy: అప్పుడు 29.. ఇప్పుడు 8.. బాబు పై కేసు పెట్టాల్సిందే!

-

Minister Kakani Govardhan Reddy Fires On Chandrababu Naidu Over Kandukur Road Show Incident: నెల్లూరు జిల్లా కందుకూరు లో నిన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ అనే రోడ్ షో లో 8  మంది మరణించిన దుర్ఘటన పై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధికార దాహంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. రోడ్ షో కి ఇరుకైన స్థలంలో ప్రజలను తరలించి.. డ్రోన్ల సహాయంతో లేనిది ఉన్నట్లు చిత్రీకరించే వ్యూహం పూర్తిగా బెడిసికొట్టిందన్నారు మంత్రి కాకాని. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన కర్మ అంటూ విరుచుకుపడ్డారు. ఈ మరణాలకు చంద్రబాబే కారణమంటూ.. బాబు పై పోలీస్ కేసు పెట్టాలని అన్నారు.

- Advertisement -

చంద్రబాబు సభలు, సమావేశాలకు జనం ఎందుకు వస్తారు?.. అధికారంలో ఉండగా  మంచి పనైనా చేసారా? అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను మోసం చేసిన బాబు(Chandrababu Naidu) మళ్ళీ అవకాశం ఇవ్వమని అడగడం విడ్డురమని అన్నారు. గతంలో పుష్కరాల సందర్భంగా 29 మందిని.. ఇప్పుడు 8 మందిని బలితీసుకున్నారని అన్నారు. చంద్రబాబు ఇదేం కర్మ అని ప్రజలనుకుంటున్నారని మంత్రి కాకాని(Kakani Govardhan Reddy) అన్నారు. ప్రాణాలను బలితీసుకున్న బాబు.. వారి ప్రాణాలకు వెలకడుతున్నారని అన్నారు.

Read Also: 18 మంది చిన్నారుల మృతి.. ఇండియాపై ఉజ్బెకిస్థాన్ ఫైర్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...