వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ జగన్ చేసిన కామెంట్లకు అదే స్టైల్లో నాదెండ్ల చురకలంటించారు. జనానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి విమర్శించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన జగన్.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డబల్ యాక్షన్ చేస్తున్నారన్నారు. అధికార పార్టీ మీదే ప్రతిపక్ష పార్టీ మీదే అంటే ఎలా కుదురుతుంది అని ప్రశ్నించారు. “ఆ మనిషి కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు” అంటూ పవన్ కళ్యాణ్ పై జగన్(YS Jagan) వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) మీడియా ఎదుట స్పందించారు. “జగన్ పరిపాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే.. పవన్ కళ్యాణ్ స్వయంగా ఐదు కోట్లు విరాళం ప్రకటించి కౌలు రైతులకు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి కౌలు రైతులకు విరాళాలు అందించాము. చివరికి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూడా రూ.లక్ష చొప్పున 24 మందికి విరాళం అందించినట్లు తెలిపారు. కానీ జగన్ ఏరోజు ప్రజలకు మద్దతుగా నిలబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ క్రిమినల్ మైండ్ తో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్నారు. మేము కూడా “నువ్వు కోడి కత్తికి ఎక్కువ… గొడ్డలి పోటుకి తక్కువ” అనగలం అంటూ కౌంటర్ ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ బెంగుళూరు ఎమ్మెల్యే పద్ధతిగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు.