ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సాక్షిగా.. ఏపీలో డీఎస్సీ(DSC) ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తుందని, అది పూర్తయిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలోనే 16,387 ఉపాధ్యాయుల పోస్ట్‌లను భర్తీ చేస్తామని వెల్లడించారు. సాంకేతిక కారణాలతో డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడిందని చెప్పారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే రాష్ట్రంలో 16,387 పోస్టులను భర్తీ చేయడానికి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ విద్యాసంవత్సరానికే కొత్త ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు.
‘‘శాసనమండలి సాక్షిగా చెప్తున్నా.. ఏప్రిల్ లేదా మే నెలలో తల్లికి వందనం(Thalliki Vandanam), అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava) పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం. యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నా. వాటి పరిష్కారం కోసం పాటుపడతా. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రమే లక్ష్యంగా పనిచేస్తా’’ అని లోకేష్(Nara Lokesh) తెలిపారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఐదురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి నెల 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీకి ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అవి పూర్తయ్యే వరకు ఏపీల ఎన్నికల కోడ్ అమలు కానుంది.