Minister Roja: పవన్‌‌‌ది రోజుకో మాట.. పూటకో వేషం

-

టీడీపీ, బీజేపీతో జత కట్టినప్పుడు ఉత్తరాంధ్రలో వలసలు పవన్‌కు గుర్తు రాలేదా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్‌ కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోయి విచిత్రమైన ట్వీట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రోజుకో మాట.. పూటకో వేషం వేసుకుంటే ప్రజలు కొడతారు జాగ్రత్త అంటూ పవన్‌ను హెచ్చరించారు. 29 గ్రామాల కోసం 26 జిల్లాలను పణంగా పెట్టలేమనీ.. అమరావతిలోనే కాదు, రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ రైతులున్నారని రోజా అన్నారు. ఇది అమరావతి ఉద్యమం కాదనీ.. అత్యాసపరుల ఉద్యమం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం అమరావతి రాజధానిగా కావాలంటున్నారని ఆరోపించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Read also: Rajagopal Reddy: నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...