Minister Roja | ‘చంద్రబాబు మాటలు వినడం ఆపేయ్.. చిరంజీవిని నమ్ము’

-

జనసేన అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా(Minister Roja) కీలక సలహాలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు మాటలు కాకుండా పవన్ కల్యాన్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మాటలు వినాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మాటలు నమ్మి పవన్‌ ప్రజల దృష్టిలో విలన్‌గా మారుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అవసరం కోసం బూతు పురాణాన్ని స్క్రిప్ట్ రూపంలో ఇచ్చారని ధ్వజమెత్తారు. ఆ బూతు పురాణాన్ని పవన్ కల్యాణ్(Pawan Kalyan) పటిస్తున్నారని చెప్పుకొచ్చారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయన పవన్ కల్యాణ్‌ వారాహి విజయ యాత్ర(Varahi Yatra) ఎందుకు చేస్తున్నారని అన్నారు. ఈ వారాహి విజయ యాత్రలో పవన్ కల్యాణ్‌ ఎంతసేపు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారే తప్ప ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పడం లేదని రోజా(Minister Roja) అన్నారు. పవన్ కల్యాణ్ ఎంత గొంతు చించుకున్నా మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. పవన్ సింగిల్‌గా వచ్చినా.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని గుంపులుగా వచ్చినా 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు.

- Advertisement -
Read Also:
1. పవన్‌పై ముద్రగడ, ద్వారంపూడి విమర్శలను తిప్పికొట్టిన నిర్మాత నట్టికుమార్
2. చెర్రీ కంగ్రాట్స్.. నిన్ను ఎత్తుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి: రోజా

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...