Minister Roja: కళామతల్లి ముద్దుబిడ్డలు.. గోదావరి జిల్లా కళాకారులు

-

Minister Roja Participated in rajamundry jagananna cultural programme: వెయ్యి సంవత్సరాలుగా గోదావరి జిల్లాలో కళలు, సంస్కృతి విరాజిల్లుతున్నాయని మంత్రి ఆర్కే రోజా అన్నారు. కళామతల్లి ముద్దుబిడ్డల గోదావరి జిల్లాల కళాకారులే అని కితాబునిచ్చారు. తుర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, మన కళలను భవిష్యత్‌ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాకారులను దూషించేవారు జీవితంలో బాగుపడరని ఆమె హెచ్చరించారు.

- Advertisement -

అనంతరం మీడియాతో మాట్లడిన మంత్రి రోజా, టీడీపీ మహిలా నేత వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తను ఏళ్ల నుంచి నగరిలో ఉన్నబట్టే.. తనను నగరి ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. కానీ పాయకరావుపేట, కొవ్వూరు ప్రజలు అనితను ఛీత్కరించుకుని, ఎన్నికల్లో తిప్పి కొట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందనీ.. మిగిలిన రాష్ట్రాల సీఎంలు సైతం ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్‌ తీర్చిదిద్దుతున్నారని మంత్రి రోజా (Minister Roja) అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...