విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)పై కేంద్ర ఉక్కుశాఖ కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోదని తేల్చి చెప్పింది. ఆర్ఐఎన్ఎల్(RINL) డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ఆగిపోలేదని పేర్కొంది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ఆర్ఐఎన్ఎల్ పని తీరు మెరుగుపరచడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తోందని కేంద్ర ఉక్కుశాఖ వెల్లడించింది. ఆర్ఐఎన్ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలుపుదల చేసినట్లు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రవేటీకరణ చేయబోమని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ గురువారం ఏపీ పర్యటనలో ప్రకటించగా దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే.
Read Also: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. హెలికాప్టర్‌తో పూల వర్షం
Follow us on: Google News, Koo, Twitter