తను నమోదు చేసిన కేసులోని నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) కోరారు. అంతేకాకుండా ఒక ఎంపీని కిడ్నీప్ చేసి కస్టడీ పేరుతో హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఆయన ఏపీ డీజీపీని, హోం మంత్రి వంగలపూడి అనితను రఘురామ అభ్యర్థించారు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటిని కేసు విచారణ అధికారికి అందిస్తానని, ఈ కేసులో ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు నిందులను అరెస్ట్ చేసే ఉంచాలని, సాక్షులకు కూడా ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన కోరారు. అప్పటి వైద్యులపై మళ్ళీ ఎవరూ ఒత్తిడి తీసుకురాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అప్పట్లో హైకోర్టు జడ్జి సమక్షంలో మిలటరీ వైద్యులు సిద్ధం చేసిన నివేదికలో కూడా తనను హింసించినట్లు ఉందని గుర్తు చేశారు. తనను కొట్టిన వారో తెలియదు అని గతంలో చెప్పిన మాట వాస్తవమేనని, కానీ అందుకు కుట్ర పన్నింది మాత్రం జగన్, పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు అని చెప్పారాయన. ఇప్పుడు తన కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ప్రయత్నిస్తున్నారని, ఆధారాలు ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చని ఆర్ఆర్ఆర్ చెపపుకొచ్చారు. ఈ కేసు విచారణను వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కూడా కోరారు రఘురామ(Raghu Rama Krishna Raju).