అన్నవరం ఆలయంలో తనిఖీలు.. అంతా పురుగుల మయం..

-

టీటీడీ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారణ కావడంతో రాష్ట్రంలోని ఇతర ఆలయాలల్లోని ప్రసాదాల నాణ్యతపై కూడా నేతలు దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే నిన్న భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు.. సింహాచలం ఆలయాన్ని సందర్శించి అక్కడి ప్రసాదం నాణ్యతను పరిశీలించారు. సింహాచలం ఆలయంలో ప్రసాదం కోసం వినియోగిస్తున్న నెయ్యి నాణ్యత విషయంలో ఎమ్మెల్యే పెదవి విరిచారు. ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడమని, తప్పకుండా దీనిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కూడా అన్నవరం(Annavaram) దేవస్థానంలో తినిఖీలు చేశారు. ప్రసాదం కోసం వినియోగించే ముడిసరుకులను పరిశీలించారు. ప్రసాదం తయారీ, అన్నదానం, ఆర్జిత సేవలకు గుత్తేదారు నుంచి కొనుగోలు చేస్తున్న సరుకులను తనిఖీ చేశారు.

- Advertisement -

బన్నీ రవ్వలో పురుగులు ఉండటాన్ని, పంచదారలో చీమలు ఉండటాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ గుర్తించారు. ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను కోరగా.. దత్తత దేవాలయాలు, వేద పాఠశాలకు సరుకులు పంపించగా ఇవి మిగిలాయని అధికారులు వివరణ ఇచ్చారు. అనంతరం దేవస్థానం నిర్వహించే నమూనాల పరీక్షలు, దేవస్థానానికి గుత్తేదారు అందించే ల్యాబ్ నివేదికలను కూడా ఆమె పరిశీలించారు. దీంతో పాటుగా ప్రసాదం తయారీ విధానం, అందులో వినియోగించే నెయ్యి, పంచదార, గోధుమలు, యాలకులను కూడా పరిశీలించి.. వాటి నమూనాలను కూడా తీసుకెళ్లారు ఎమ్మెల్యే.

ప్రసాదం తయారీకి వినియోగించే సరుకులను అందించే గుత్తేదారులను ఎంచుకోవడం కోసం ఆరు నెలలకోసారి టెండర్లను పిలుస్తున్నప్పటికీ గత రెండేళ్లుగా నెయ్యి సరఫరాను ఒక్కరికే ఎందుకు ఇచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అంతేకాకుండా సింహాచలం, అన్నవరం(Annavaram) దేవస్థానాలకు ఒక్కరే నెయ్యి సరఫరా చేస్తున్నప్పటికీ ధరల్లో తేడాలు ఎందుకు ఉన్నాయని నిలదీశారు. దీనిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరతామని వెల్లడించారామే.

Read Also: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీటీటీ కీ అప్‌డేట్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీటీటీ కీ అప్‌డేట్

శ్రీవారి లడ్డూ(Tirumala Laddu) ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్‌డేట్...

నిద్రే నిద్ర వస్తుందా.. కారణాలు ఇవేనేమో..!

Sleepiness | సాధారణంగా నిద్ర లేకపోవడం చాలా మందిలో సమస్య. కానీ...