ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు(Monsoons) కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. రుతుపవనాల రాకకు దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. కేరళ నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు(Monsoons) విస్తరిస్తాయని పేర్కొంది. దీంతో పలు చోట్ల మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. అయితే రుతుపవనాల రాక కొంచెం ఆలస్యమయ్యే అవకాశముందంటూ ప్రైవేటు వాతావరణ శాఖ స్కైమేట్ అంచనా వేసింది. దీంతో స్కైమేట్ ప్రకటనను ఖండిస్తూ ఐఎండీ తాజా ప్రకటన విడుదల చేసింది.
ప్రజలకు చల్లటి కబురు.. రెండు రోజ్లులో రుతుపవనాలు రాక
-
- Advertisement -