మూడు రాజధానుల పేరిట ఉత్తరాంధ్రులను రెచ్చగొట్టి.. రైతుల పాదయాత్రపై దాడి చేయాలని కుట్ర జరుగుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వైసపీ సర్కారుపై ధ్వజమెత్తారు. అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసిన తరువాత అనేక కుట్రలు పన్నుతున్నారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్, మంత్రులు వికేంద్రీకరణ పేరిట అవాస్తవాలు చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని విమర్శలు గుప్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జగన్ అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే.. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక ఎన్ని లక్షల కోట్లు సంపాదించి ఉంటారో అని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజలను సీఎం జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారనీ, ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమరావతే రాజధానిగా ప్రకటించేంత వరకు తమ పోరాటం ఆగదని ఎంపీ కనకమేడల మరోసారి స్పష్టం చేశారు.
వికేంద్రీకరణ పేరిట అవాస్తవాలు చెప్తున్నారు: ఎంపీ కనకమేడల
-