MP Vijayasai Reddy in chikoti Farm House: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాములు, పక్షులు, ఇతర జంతువులతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. అవి శంషాబాద్ ఫామ్‌హౌస్‌లో తీసుకున్న ఫోటోలని విజయసాయి రెడ్డి క్యాప్యన్ జత చేశారు. కాగా, కేసినో వివాదంలో విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ ఫామ్‌హౌస్‌లోని పాములు, పక్షులతో విజయసాయి రెడ్డి ఫోటోలు దిగినట్లు వెల్లడవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాసినో వివాదం సంచలనంగా మారింది. ఆ సయమంలో ఈ ఫామ్‌హౌస్ వెలుగులోకి రావటం.. ఓ మినీ జూను చికోటి ప్రవీణ్ రన్ చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
అయితే, ఈ ఫామ్‌హౌస్‌లో ఉంటున్న జంతువులు, పాములు, పక్షులకు అనుమతి తీసుకున్నారా లేదా అన్న అంశంపై అధికారులు విచారణ కూడా జరిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయి రెడ్డి సదరు ఫామ్ హౌస్‌కు వెళ్లటం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. గతంలో గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని క్యాసినో నిర్వహించారని తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ప్రతిపక్షాలు చెవులుకొరుక్కుంటున్నాయి. ఇంత వివాదాస్పద ఫామ్‌హౌస్‌కు ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) వెళ్లాల్సిన అవసరం ఏమెుచ్చిందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
Admiring the exquisite beauty of the different species of animals is my kind of recreational activity!
Sharing few snippets from the time spent at Shamshabad farm today. pic.twitter.com/FgWzjA6qgJ
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2022