Nadendla Manohar fires on CM Jagan: విశాఖ పర్యటనలో ఉన్న జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరదాలు లేకుండా సొంత నియోజకవర్గంలో కూడా సీెం జగన్ తిరగలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నర్సాపురంలో సీఎం సభలో మహిళల నల్ల చున్నీలు తీయించటం వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని నాదెండ్ల అన్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలు వైసీపీపై తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. జనసేనకు కాండక్ట్ సర్టిఫికేట్‌ను ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదని నాదెండ్ల అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి.. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ వైసీసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అన్యాయాలను ప్రశ్నిస్తుంటే.. తమను రౌడీసేన అంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకుని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌లో రెండు ముఖాలు ఉన్నాయనీ.. బయటకు కనిపించేది ఒక్కటైతే.. తెరవెనుక మరొకటి ఉందని నాదెండ్ల (Nadendla Manohar) ఆరోపించారు.