Nadendla Manohar: పరదాలు లేనిదే.. సొంత నియోజకవర్గంలో తిరగలేని సీఎం!

-

Nadendla Manohar fires on CM Jagan: విశాఖ పర్యటనలో ఉన్న జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరదాలు లేకుండా సొంత నియోజకవర్గంలో కూడా సీెం జగన్‌ తిరగలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నర్సాపురంలో సీఎం సభలో మహిళల నల్ల చున్నీలు తీయించటం వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని నాదెండ్ల అన్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి జగన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు వైసీపీపై తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. జనసేనకు కాండక్ట్‌ సర్టిఫికేట్‌ను ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదని నాదెండ్ల అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి.. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ వైసీసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అన్యాయాలను ప్రశ్నిస్తుంటే.. తమను రౌడీసేన అంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకుని జగన్‌ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌లో రెండు ముఖాలు ఉన్నాయనీ.. బయటకు కనిపించేది ఒక్కటైతే.. తెరవెనుక మరొకటి ఉందని నాదెండ్ల  (Nadendla Manohar) ఆరోపించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు...