పవన్ కల్యాణ్ కు రూ.కోటి విరాళం ఇచ్చిన నాగబాబు

-

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్(Ram Charan) పుట్టినరోజు సందర్భంగా గత మార్చి 27న ఆయన నటించిన ఆరెంజ్ సినిమా రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 2010, నవంబర్ 26న విడుదలైన ఈ మూవీ అప్పట్లో ఫ్లాప్ అయినా కానీ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ సినిమా రీరిలీజ్ చేయడంతో అభిమానులు థియేటర్లకు పోటెత్తడతంతో రూ.1.05 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఈ డబ్బును ఆరెంజ్ సినిమా నిర్మాత నాగబాబు(Nagababu) జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు చెక్కును పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు నాగబాబు(Nagababu) అందజేశారు. కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చెర్రీ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో కమర్షియల్‌గా ఆడలేదు. అయితే కొంతమంది అభిమానులకు మాత్రం ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది.

- Advertisement -
Read Also: రూ.2000 నోట్లను ఎలా మార్చుకోవాలంటే?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...