జనసేన ప్రచార రథమైన వారాహి వాహనంపై పార్టీ నాయకుడు కొనిదెల నాగబాబు(Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ విప్లవ శంఖారావం వారాహి(Varahi) అని తెలిపారు. వారాహితో పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చూట్టాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారాహి చరిత్ర సృష్టించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దామని రాష్ట్ర ప్రజలకు నాగబాబు(Nagababu) పిలుపునిచ్చారు. చార్మిత్మక ఘట్టంలో భాగస్వాములం అవుదామని తెలిపారు. కాగా, ఇటీవలే పవన్‌కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటన వివరాలను జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వెల్లడించారు. పర్యటించనున్న ప్రాంతాలు, జనసేన చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను ఆయన వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పవన్ పర్యటన ఉంటుందని, ఒక్కో నియోజకవర్గంలో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారని సమాచారం.