మా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు: చంద్రబాబు

-

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యకు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) విషెస్ చెప్పారు. ‘నటునిగా కళాసేవ… ఎమ్మెల్యేగా ప్రజాసేవ… ఆసుపత్రి నిర్వహణతో సమాజ సేవ చేస్తున్న మా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మీరు… నిండు నూరేళ్లూ ఆనందంతో, ఆరోగ్యంతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను’ అని బాబు ట్వీట్ చేశారు.

- Advertisement -

తన మావయ్యకు టీడీపీ యువనేత నారా లోకేశ్ విషెస్ తెలిపారు. ‘ప్రియమైన బాలా మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కుటుంబంలో ఎప్పుడూ ప్రియమైన వ్యక్తిగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి’అని ఆకాంక్షించారు.

ఇక మరో నందమూరి హీరో కల్యాణ్ రామ్ కూడా’ హ్యాపీ బర్త్ డే బాబాయ్. ఇప్పడే ‘భగవంత్ కేసరి’ టీజర్ చూశాను. ఎప్పటిలాగే ఫెరోషియస్’గా ఉన్నారని ట్విట్టర్లో విష్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...