ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) మరోసారి తన మంచి మనసు చాటి వార్తల్లో నిలిచారు. కొన్ని రోజులుగా ఏజెంట్‌ల మాటలు నమ్మి అరబ్ దేశాలకు వెళ్ళి మోసపోయిన వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడంలో లోకేష్ కీలకంగా వ్యవహరించారు. నెల రోజుల వ్యవధిలోనే అరబ్ దేశాల్లో చిక్కుకున్న నానా అవస్థలు పడుతున్న ఇద్దరు వ్యక్తులను వారి స్వగ్రామాలకు చేర్చి ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి తన మంచి మనసు చూపారు లోకేష్. తనకు ట్రిపుల్ఐటీ చదువుకోవాలని ఉందని, పూణెలోని ఓ కళాశాలలో సీటు వచ్చినా అధిక ఫీజు కారణంగా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు సాయం చేయాలంటూ బసవయ్య అనే యువకుడు చేసిన అభ్యర్థన లోకేష్‌కు చేరింది. వెంటనే స్పందించిన లోకేష్ బసవయ్య భయమొద్దు.. నువ్వు పూణెలోనే చదువుకునేలా చూప్తానంటూ ఆపన్న హస్తం అందించారు.
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన నాగబసవయ్య అనే యువకుడు.. ‘‘నాకు ఐఐటీ జేఏఎం2024లో 930వ ర్యాంక్ వచ్చింది. లక్నో ట్రిపుల్ ఐటీలో సీటు కూడా లభించింది. ఈ కోర్సుకు సుమారు రూ.4లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంది. కానీ నా కుటుంబం ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది. అంత మొత్తం భరించలేని భారమవుతుంది. దయచేసి సహాయం చేయగలరు’’ అంటూ నారా లోకేష్‌ను ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌ను చూసిన లోకేష్ వెంటనే అతడికి భరోసా కల్పించారు. ‘‘నువ్వు లక్నో ట్రిపుల్ ఐటీలో చదువుకుంటావు. నీ కలను సాధించే దిశగానే ప్రయాణిస్తావు. ఫీజు గురించి నేను చూసుకుంటా. ఆల్ ది బెస్ట్ బసవయ్య’’ అంటూ Nara Lokesh రిప్లై ఇచ్చారు.