Tarakaratna మృతిపై నారా లోకేష్ ఎమోషనల్ వర్డ్స్

-

Nara Lokesh Emotional Tweet about Nandamuri Tarakaratna: మహాశివరాత్రి నాడు నందమూరి, నారా కుటుంబంలో కోలుకోలేని విషాదం నెలకొంది. 23 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి కుటుంబసభ్యుల్లోనూ, టీడీపీ శ్రేణుల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. తారకరత్న మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఆయన మృతిపై ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

- Advertisement -

“బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న(Tarakaratna) మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు.”

“నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను” అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...