తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. తొలి రోజు కీలక నేతల నామినేషన్లు..

-

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆర్వో కేంద్రాల వద్దకు చేరుకుని నామినేషన్లు సమర్పించారు. దీంతో నామినేషన్ల కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది.

- Advertisement -

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్‌(Nara Lokesh) నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నాయకులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి రాజకుమారికి సమర్పించారు. ఇక ఒంగోలు లోక్ సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొదటి సెట్ నామినేషన్ వేశారు. ఈనెల 25న భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి నామినేషన్లు వేశారు. అలాగే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక.. శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో రాజంపేట వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తరఫున ఆయన తల్లి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

తెలంగాణలోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, నల్గొండ బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ వేశారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మొదటి సెట్ నామినేషన్ వేశారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరఫున కాంగ్రెస్ నాయకులు మొదటి సెట్ నామినేషన్ వేశారు.

Read Also: సీఎం జగన్‌ పై రాయి దాడి కేసులో నిందితుడు అరెస్ట్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...