YCP MLA Raghurami Reddy: కడప జిల్లా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బ్రహ్మంగారిమఠం మండలం నర్సిరెడ్డిపల్లె గ్రామానికి వెళ్లారు రఘురామిరెడ్డి. గడప గడపకు కార్యక్రమాన్ని గ్రామస్థులు బహిష్కరించారు. ఆయన గురువారం గ్రామానికి వస్తున్నారని తెలియడంతో ప్రజలు అనూహ్య షాకిచ్చారు. ఆయన వచ్చే ముందు ఇళ్లకు తాళం వేసుకుని వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. గ్రామానికి రోడ్డు వేయలేదని నిరసన తెలుపుతూ ఇలా చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఊరిలో ఉన్న ఒక్క వ్యక్తినే కలిసి వెనుదిరిగారు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.