NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయన్న అంశంపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతి తిరుమల భక్తులు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తిరుమల ప్రసాద తయారీలో వినియోగించిన నెయ్యిలో చేప నూనెలు, పామాయిల్, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కలిసి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్(NDDB) కాఫ్ లిమిటెడ్ తెలిపింది. దాంతో పాటుగా తాము అందించిన నివేదిక వందకు వందశాతం వాస్తవం కాకపోవచ్చని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇది తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని సదరు సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఆ ప్రత్యేక సందర్భాలేంటంటే..
తీవ్ర పోషకాహార లోపం ఉన్న ఆవు నుంచి తీసిన పాలతో తయారు చేసిన నెయ్యి నమూనాలు ల్యాబ్‌కు పంపినప్పుడు.
ఆవాలు, అవిసెలు, పామాయిల్ వంటి వెజిటెబుల్ ఆయిల్స్ ఆహారంగా పొందిన ఆవుల నుంచి తీసిన పాలతో తయారు చేసిన నెయ్యి నమూనాలు పంపినప్పుడు.
గెర్బర్, వెయిబుల్-బెర్న్‌ట్రూప్, రాట్జ్ లాఫ్ తదితర విధానాల ద్వారా సేకరించిన పాలతో తయారైన నెయ్యి నమూనాలు పంపినప్పుడు.
ఇటువంటి ప్రమాణాల్లో మాత్రమే తాము పంపిన నివేదిక తప్పు అయ్యే అవకాశం ఉందని ఎన్‌డీడీబీ కాఫ్ లిమిటెడ్ తన నివేదిక(NDDB Report)లో పేర్కొందని టీడీపీ వెల్లడించింది.