రాష్ట్ర నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్వీర్యమై ఉందని, దానిని పునరుద్దరించడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వైసీపీ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖ(Irrigation Department)లో విధ్వంసం సృష్టించిందని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ శాఖను బద్నాం చేసి రైతులను గాలికి వదిలేసిన ఘనత మాజీ సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్ల మండలం మొగల్తూరు మురుగు డ్రైనేజీ ప్రక్షాళన పనులను నిమ్మల రామానాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ(YCP) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్(YS Jagan) నిర్లక్ష్యం చేసిన పూడికతీత, గేట్లు, షట్టర్లు, లాకులు, రోప్ వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నట్లు మంత్రి వివరించారు.
Nimmala Ramanaidu | ఇరిగేషన్ శాఖను బద్నాం చేసిన ఘనత జగన్‌దే: నిమ్మల
-