Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిది. దీంతో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు.. 25 ఎంపీ స్థానాల కోసం 503 నామినేషన్లకు ఈసీ ఆమోదం లభించింది. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం… తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు.. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి 6 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇక లోక్‌సభ నియోజకవర్గాల విషయానికొస్తే… నంద్యాల ఎంపీ స్థానానికి అత్యధికంగా 36 నామినేషన్లు.. అత్యల్పంగా రాజమండ్రి ఎంపీ స్థానంలో 12 నామినేషన్లు దాఖలయ్యాయి.
Nomination Withdrawal | అటు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 268 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరికొంతమంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం పార్లమెంట్ స్థానాలకు 625 మంది బరిలో నిలిచారు. ఇక అత్యధికంగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి 77 నామినేషన్లు దాఖలు కాగా.. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అత్యల్పంగా 12 నామినేషన్లు వచ్చాయి. కాగా రెండు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.