NTR health university: పేరు మార్పుకు గవర్నర్‌ ఆమోదం

-

NTR health university: డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరు మారుస్తూ వైసీపీ సర్కారు తీర్మానం చేసింది. దీనికి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్‌ ఆమోదించటంతో.. పేరు మార్పు బిల్లును చట్టబద్ధంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. సోమవారం నుంచి ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఇప్పుడు అధికారికంగా వైయస్‌ఆర్‌ హెల్త్‌ వర్సిటీగా మారిపోయింది. కాగా, హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పేరు మార్పుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏమెుచ్చిందని టీడీపీ నేతలు ప్రశ్నించినా.. ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. తన తాత పేరుపై ఉన్న వర్సిటీ (NTR health university) పేరు మార్పుపై తారక్‌ న్యూట్రల్‌గా ఉండటంతో.. అతడు కూడా పలు విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది.

- Advertisement -

Read also: జనసేన పొలిటికల్ పార్టీ కాదు.. సినిమా పార్టీ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...