అనకాపల్లి(Anakapalle) జిల్లా పరవాడలోని పారిశ్రామిక ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఇప్పటికే ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కాగా ఈరోజు క్షతగాత్రుల్లో ఒకరైన కెమిస్ట్ సూర్యనారాయణ కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యనారాయణ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మృతదేహాన్ని మార్చురీకి తరలించామని వైద్యులు తెలిపరు. ఈనెల 23న లాల్‌సింగ్ పూరి, 24న రోయా అంగిరియా అనేవారు మరణించారు.
Anakapalle | సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రిడియన్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆగస్టు 23 గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. అయితే సంఘటన అర్ధర్రాతి జరిగినా శుక్రవారం ఉదయం 9 గంటల వరకు బయటి ప్రపంచానికి తెలియలేదు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను విశాఖపట్నంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఒక మెడిసిన్ తయారీకి కావాల్సిన రకరకాల ఉత్పత్తులను కలపాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కంపెనీలో ముడి మందును మిక్స్ చేసే సమయంలో వారికి ఉండాల్సిన షూట్స్ ఉండలేదని, యాజమాన్యం వారికి సరైన డ్రెస్‌లు ప్రొవైడ్ చేయలేదనే విమర్శలు ఉన్నాయి.