టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) తీవ్రంగా ఖండించారు. “ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది.” అని ఆమె ట్వీట్ చేశారు.
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది.
— Daggubati Purandeswari ?? (@PurandeswariBJP) September 9, 2023
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్టుపై కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఏముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఏదైనా ఉంటే ముందుగానే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదన్నారు. అలాగే తన తండ్రి వద్దకు వెళ్లకుండా నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు.
అటు టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటి వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే రామానాయుడు కింద పడిపోయారు. అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకి ఏదైనా జరిగితే అందుకు పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు.