బాధితులకు పరిహారం చెక్కు అందించిన ఎమ్మెల్యే

-

అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలోని ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి పరిహారంగా రూ.కోటి అందిస్తామని సీఎం చంద్రబాబు(Chandrababu) ప్రకటించారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. వారికి ప్రతి అడుగులో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగానే ఈరోజు ఎసెన్షియా ప్రమాద మృతుల్లో ఒకరి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెక్కును విజయచంద్ర(MLA Vijayachandra) అందించారు.

- Advertisement -

అచ్యుతాపురం ప్రమాద మృతుల్లో చలంవలస గ్రామానికి చెందిన పార్థసారథి కూడా ఒకరు. ఈరోజు ఆయన కుటుంబీకులను ఎమ్మెల్యే విజయచంద్ర(MLA Vijayachandra) పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వారికి పరిహార చెక్కును అందించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మృతుల కుటుంబానకి పరిహారం అందించామని, అదే విధంగా ఫార్మా సంస్థల భద్రతపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, యాజమాన్యాల నిర్లక్ష్యానికి అమాయకులైన కార్మికులు బలి కాకుండా చర్యలు చేపడతామని ఆయన పునరుద్ఘాటించారు.

Read Also: మళ్ళీ పేలిన ఫార్మా.. నలుగురికి సీరియస్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Rahul Gandhi | కుల గణన అంటే మోదీకి ఎందుకంత భయం: రాహుల్ గాంధీ

దేశంలోని అన్ని వ్యవస్థల్లో, అన్ని రంగాల్లో కుల వ్యవస్థ ఉందనేది అక్షర...

Jharkhand Elections | ఝార్ఖండ్ ఎన్నికల్లో ఇండి కూటమి మేనిఫెస్టో ఇదే..!

ఝార్ఖండ్ ఎన్నికలలో(Jharkhand Elections) ఎలాగైనా గెలవాలని ఇండి కూటమి కృషి చేస్తోంది....