Paster arrest: పాస్టర్‌ అకృత్యాలు.. సహకరించిన భార్య!

-

Paster arrest in anakapalli: అతడో పాస్టర్‌.. చర్చికి వచ్చే వారంతా అతడిని ఓ దైవ దూతగా ఆరాధించేవారు. కానీ ఆ పాస్టర్‌ వక్ర బుద్ధితో.. చర్చికి వచ్చే మహిళలను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని మాయమాటలతో లోబర్చుకునేవాడు. చిన్నపిల్లలను సైతం వదలేవాడు కాదు. పాస్టర్‌ రాసలీలకు అతడి భార్యే దగ్గరుండి సహకరించి.. మహిళలను అతడి వద్దకు పంపించేది. ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. చివరికి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పాస్టర్‌ రాసలీలు వెలుగులోకి వచ్చాయి.

- Advertisement -

అనకాపల్లిలో జీసస్‌ గ్రేస్‌ పేరిట విక్టర్‌ డేవిడ్‌ పాస్టర్‌ చర్చిని నిర్వహిస్తున్నాడు. చర్చికి వచ్చే యువతులు, మహిళల బలహీనతలను, ఆర్థిక సమస్యలను ఆసరాగా తీసుకొని పాస్టర్‌ వారని లొంగదీసుకునేవాడు. పాస్టర్‌ మనసుపడ్డ మహిళలను పాస్టర్‌ భార్యే.. మాయమాటలు చెప్పి అతని వద్దకు పంపించేది. పాస్టర్‌ మద్యం సేవించటం, అమ్మాయిలను అనుభవించటం వంటివి కుటుంబ సభ్యులు గమనించినా.. మిన్నుకుండిపోయారు. కానీ కుటుంబ సభ్యులను సైతం అదే వక్ర బుద్ధితో చూడటంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పాస్టర్‌ అకృత్యాలను వీడియో తీసిన కుటుంబ సభ్యులు, వాటిని పోలీసులకు అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నపిల్లలపై సైతం అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలటంతో.. పాస్టర్‌పై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డేవిడ్‌ అరెస్టుతో బయటకు వచ్చిన బాధితులు, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...