డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan).. ఏపీలోని వరద బాధితులకు మరోసారి భారీ విరాళం ప్రకటించారు. ఇప్పటికే రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్.. తాజాగా రెండో సారి విరాళంప్రకటించారు. ఇప్పటివరకు ఎవరూ ఇవ్వనంత అధికంగా పవన్ కల్యాణ్ విరాళం ఇవ్వడం ప్రస్తుతం కీలకంగా మారింది. ముంపు బారిన పడ్డ ప్రతి పంచాయతీకి రూ.లక్ష చొప్పున 400 పంచాయతీలకు రూ.4కోట్లు ప్రకటించారు. దీంతో పాటుగా తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఏపీలో పంచాయతీలకు ప్రకటించిన విరాళాన్ని నేరుగా పంచాయతీ ఖాతాలకు పంపిస్తానని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ తెలియచేస్తారని చెప్పారు.
అంతేకాకుండా తనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కూడా పవన్ కల్యాణ్(Pawan Kalyan) తోసిపుచ్చారు. ఇంట్లో కూర్చిని విమర్శలు చేయడం వైసీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. తనను అంటున్న వారు ఎక్కడైనా వరద బాధితులకు ఒక్క ఆహార పొట్లామైనా అందించారా అని ప్రశ్నించారు. ఆఖరికి వారి పార్టీ అధినేత జగన్ సైతం.. ఐదు నిమిషాలు పర్యటించి హడావుడి చేశారే తప్ప.. ఒక్కరికైనా సహాయం అందించారా అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: వైసీపీకి హైకోర్టు షాక్.. ముందస్తు బెయిల్‌కు నో..