ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి ప్రశ్నించారు. గ్రామ వలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు జగన్ కౌంటర్ ఇస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. జగన్ కౌంటర్లపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. గ్రామ వాలంటీర్లకు(Volunteers) అసలు బాస్ ఎవరని.. ప్రజల నుంచి వ్యక్తిగత డేటా సేకరించాలని వీరికి ఎవరు ఆదేశాలిచ్చారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
ఈ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇచ్చాందా లేదా ముఖ్యమంత్రా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరూ అంటూ ఆయన(Pawan Kalyan) అడిగారు. ప్రజల నుంచి డేటా సేకరించే విషయంలో వైసీపీ సర్కార్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అని డిమాండ్ చేశారు. అలాగే ఈ ట్వీట్‌కు ప్రధానమంత్రి కార్యాలయాన్ని, కేంద్ర హోంమంత్రి కార్యాలయాన్ని సైతం ట్యాగ్ చేశారు. మరో ట్వీట్‌లో కూడా నెల్లూరు ఎస్పీ అయిన తిరుమలేశ్వర్ రెడ్డి ఇటీవల చెప్పిన అంశాలను కూడా జత చేశారు.