రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా వేరే పార్టీలను ఒప్పిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థి తాను అయితేనే పొత్తు పెట్టుకోండి అని కొంతమంది అంటున్నారని.. గత ఎన్నికల్లో తాము కనీసం 30-40 స్థానాల్లో గెలిచి ఉంటే సీఎం వాదనకు బలం చేకూరేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలా అయితే ఛాన్స్ ఉండేదని అభిప్రాయపడ్డారు. 2019 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చామని.. రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాం.. పార్టీలను ఒప్పిస్తామంటూ పవన్(Pawan Kalyan) అన్నారు. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం తనదని తెలిపారు. తాను కమ్యూనిస్టు పార్టీలను కూడా గౌరవిస్తానని.. వారు కూడా కలిసి రావాలంటూ కోరారు. ప్రతి పార్టీకి వారిదైన ఓటింగ్ ఉంటుంది. వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పడానికి కారణం వైసీపీ(YCP)నే అంటూ పేర్కొన్నారు. మేము ఉన్నామని ఉనికి చెప్పుకోవడానికి పొలిటికల్ పార్టీ పేట్టలేదన్నారు. అలాగైతే స్వచ్ఛంద సంస్థ పెట్టుకోవచ్చు.. పార్టీ పెట్టడానికి ఐదేళ్లు అధ్యయనం చేశానని పవన్ వివరించారు. ప్రతికూల పరిస్థితుల్లో జనసేనకు 7 శాతం ఓటింగ్ వచ్చిందన్నారు. గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీకి నిలబెట్టామని వివరించారు.
Read Also: కేసీఆర్-అమిత్ షా చీకటి ఒప్పందం.. త్వరలో గజ్వేల్‌లో ఏర్పాటు!
Follow us on: Google News, Koo, Twitter